అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | నగరంలో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద, బైపాస్ రోడ్డు మార్గంలో, డిచ్పల్లి రైల్వేస్టేషన్ (Dichpalli Railway Station) ఎదురుగా ప్రధాన రహదారిపై పనులను శుక్రవారం పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు.
Collector Nizamabad | అధికారులపై అసంతృప్తి
నిజామాబాద్ (Nizamabad) నగరంలో గోల్ హనుమాన్ నుంచి పూసలగల్లీకి వెళ్లేమార్గంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సి ఉన్న ప్రాంతాలను సైతం కలెక్టర్ పరిశీలించారు. పనులను ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారం, పది రోజుల అనంతరం తాను మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతో పాటు పనుల ప్రగతిని సమీక్షిస్తానన్నారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ అధికారి ప్రవీణ్, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, ఇనాయత్ తదితరులు ఉన్నారు.