అక్షరటుడే, వెబ్‌డెస్క్: Road Accident | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరి పేటలోని చిలకలూరిపేట బైపాస్‌పై ఈ ప్రమాదం సంభవించింది.
ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Road Accident | వెనుక నుంచి బలంగా..
ముందు వెళ్తున్న ట్రాక్టర్ల లోడు కంటైనర్‌ను వెనుక నుంచి షిప్ట్ కారు ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
