Heavy Floods | ఉధృతంగా పారుతున్న నదులు.. ప్రాజెక్ట్​లకు పోటెత్తిన వరద

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | నాలుగైదు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. నదులకు వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్ట్​ (Project)లకు భారీగా వరద వస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు, తోడు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణమ్మ (Krishna River) పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే నదిపై గల జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్​, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | నాలుగైదు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. నదులకు వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్ట్​ (Project)లకు భారీగా వరద వస్తోంది.

ఎగువన కురుస్తున్న వర్షాలకు, తోడు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణమ్మ (Krishna River) పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే నదిపై గల జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్​, పులిచింతల ప్రాజెక్ట్​లు నిండాయి. దీంతో ఎగువన నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. అన్ని ప్రాజెక్ట్​ల్లోని జల విద్యుత్​ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్​ల నుంచి నీటి వదులుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. నాగార్జున సాగర్​ (Nagarjuna Sagar) 14 గేట్లు ఎత్తడంతో చూడటానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.

Heavy Floods | మంజీర ఉగ్రరూపం

గత కొంతకాలంగా వరద లేక బోసిపోయిన మంజీర నది ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చింది. నదిపై గల సింగూరు (Singuru) జలాశయానికి 20,136 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. మూడు గేట్లు ఎత్తి 22,138 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నీరు మెదక్ (Medak)​ జిల్లాలోని ఘనపురం ఆనకట్ట మీదుగా నిజాంసాగర్​లోకి వెళ్తోంది. సింగూరు నుంచి భారీగా వరద వస్తుండటంతో పాపన్నపేట మండలంలోని ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఏడుపాయల ఆలయం (Edupayala Temple) వద్ద మంజీర ఉధృతంగా పారుతుండటంతో అధికారులు ఆలయాన్ని మూసి వేశారు. మూడు రోజులుగా వనదుర్గా మాత ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో పూజలు చేస్తున్నారు.

Heavy Floods | నిజాంసాగర్​కు పెరిగిన ఇన్​ఫ్లో

కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్​ (Pocharam Project) పొంగి పొర్లుతోంది. ఆ నీరు మంజీర ద్వారా నిజాంసాగర్​లోక్ వెళ్తున్నాయి. సింగూరు నుంచి సైతం నీటి విడుదల కొనసాగుతుండటంతో నిజాంసాగర్ (Nizam Sagar)​ ప్రాజెక్ట్​కు ఇన్​ప్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలోకి 20 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. సాయంత్రం వరకు భారీగా పెరిగే అవకాశం ఉంది. నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరామ్​ సాగర్​ (Sriram Sagar)కు సైతం భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్​లోకి 89 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. నీటిమట్టం 51 టీఎంసీలకు చేరింది.

Heavy Floods | ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో..

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడటంతో వాగులు, నదులు ఉప్పొంగి పారుతున్నాయి. నిర్మల్​ జిల్లా కడెం ప్రాజెక్ట్​కు 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాత్నాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది.

గేట్లు ఎత్తడంతో తర్ణం వాగులోకి వరద చేరింది. తాత్కాలిక వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఆదిలాబాద్-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో పలు కాలనీలు జలమయం అయ్యాయి.

Heavy Floods | జంట జలాశయాలకు జలకళ

హైదరాబాద్‌ (Hyderabad) ప్రజలకు తాగు నీరు అందించే జంట జలాశయాలు హిమాయత్​సాగర్​, ఉస్మాన్​ సాగర్​కు వరద కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్‌ 4 గేట్లు ఎత్తి 3,854 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌కు 900 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండటంతో నిండుకుండలా మారింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...