అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Smriti Mandhana | టీమిండియా మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి విషయంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు ఎక్కువయ్యాయి. నవంబర్ 21న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో (Director Palash Muchhal) ఆమె నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
నవంబర్ 23న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వివాహాన్ని వాయిదా వేసుకున్నారని ప్రచారం కొనసాగుతోంది. ముఖ్యంగా మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడిందని సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఇక న్యూఇయర్ తర్వాత పెళ్లి జరుగుతుందన్న టాక్ వైరల్‌గా మారింది. ఇదే సమయంలో స్మృతి మంధాన తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేసిన వీడియో మరింత కలకలం రేపుతోంది.
Smriti Mandhana | ఎంగేజ్‌మెంట్ రింగ్ మిస్..
ప్రపంచకప్ విజయం తర్వాత తొలిసారి ఆమె పబ్లిక్‌గా మాట్లాడిన ఈ వీడియోలో ఎక్కడా ఎంగేజ్‌మెంట్ రింగ్ (Engagement Ring) కనిపించకపోవడం నెటిజన్లలో అనుమానాలు రేకెత్తించింది. “అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 12 ఏళ్లయ్యాయి. ప్రపంచకప్ సమయంలో ఎప్పటికప్పుడు హృదయవిదారకమైన క్షణాలను ఎదుర్కొన్నాం. విజయం సాధించిన ఆ రోజు నాకు మళ్లీ చిన్నపిల్లలా అనిపించింది. మ్యాచ్ సమయంలో జట్టుకు ఏం అవసరమో దానిపై మాత్రమే దృష్టి పెడతా. ఫీల్డింగ్ సమయంలో మాత్రం దేవుళ్లను గుర్తుచేసుకుంటూ వికెట్లు రావాలని కోరుకుంటా” అని మంధాన వీడియోలో చెప్పిన విషయాలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
అయితే ఆమె చేతికి రింగ్ లేకపోవడం, అలాగే పెళ్లికి సంబంధించిన పోస్టులను సోషల్ మీడియా (Social Media) నుంచి తొలగించడం రూమర్లకు మరింత ఊపిరి పోసింది. “పెళ్లి క్యాన్సిల్ చేశారా?” అనే ప్రశ్నలు నెటిజన్లలో గుబులు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ తల్లి అమిత స్పందిస్తూ, “పెళ్లి త్వరలోనే జరుగుతుంది. రెండు కుటుంబాలు కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మేమంతా సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. వధువుతో కలిసి ఇంటికి రావాలని పలాష్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఆమె కోసం ప్రత్యేక స్వాగతం ప్లాన్ చేశాం” అని తెలిపారు. మంధాన, పలాష్‌ల వివాహంపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో తెలియదు కాని, ఆ లోపు సోషల్ మీడియాలో మాత్రం రూమర్ల హడావిడి ఆగేలా కనపడడం లేదు.
