Homeజిల్లాలుకామారెడ్డిRight to Information Act | సమాచార హక్కు చట్టం.. వజ్రాయుధంలాంటిది..

Right to Information Act | సమాచార హక్కు చట్టం.. వజ్రాయుధంలాంటిది..

Right to Information Act | సమాచార హక్కు చట్టం వజ్రాయుధం లాంటిదని స.హ. చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్​ సలీం పేర్కొన్నారు. ఎల్లారెడ్డి, నిజామాబాద్​లలో నిర్వహించిన కార్యకమాల్లో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Right to Information Act | సమాచార హక్కు చట్టం ప్రజల చేతుల్లో వజ్రాయుధం లాంటిదని డీఎస్పీ శ్రీనివాసరావు (DSP Srinivasa Rao), స.హ. చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్​ ఎంఏ సలీం అన్నారు.

ఎల్లారెడ్డి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో (DSP Office) శనివారం స.హ.చట్టం–2005 వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2005 అక్టోబర్ 12న చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు.

Right to Information Act | ఎల్లారెడ్డి డివిజన్​లో..

ఎల్లారెడ్డి (Yellareddy) డివిజన్​లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టం బోర్డులు ఉన్నాయని తెలిపారు. వీటిపై ప్రజా సమాచార అధికారి పేర్లు ఉంటాయని.. ప్రజలు ఆయా పోలీస్ స్టేషన్ల ద్వారా వారి కావాల్సిన ఎఫ్​ఐఆర్​, ఛార్జిషీట్లను కూడా పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి (Yellareddy CI Rajireddy), లింగంపేట్ మండల సబ్ ఇన్​స్పెక్టర్​ దీపక్ కుమార్, స.హ. చట్టం పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా సలహాదారులు దండగుల లింగమయ్య, షేక్ మదర్ పాష, జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఇంతియాజ్, ప్రతినిధులు మహమ్మద్ మసూద్, యాదగిరి గౌడ్, శ్రీకాంత్,మోహన్ రెడ్డి, షేక్ అయూబ్ మరియు స్థానిక డీఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Right to Information Act | నిజామాబాద్​ నగరంలో..

అక్షరటుడే నిజామాబాద్ సిటీ : సమాచార హక్కు వారోత్సవాలను నగరంలోని మాణిక్​ భవన్​ పాఠశాలలో (Manik Bhavan School) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్​టీఐ రాష్ట్ర సలహాదారుడు కేతు రమణారెడ్డి కేక్​ కట్​ చేసి వారోత్సవాలను ప్రారంభించారు.

అనంతరం స.హ.చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్​ సలీం మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని డివిజన్లలో, మండలాల్లో చట్టం వార్షికోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. న్యాయవాది శ్రీనివాస్​రావు మాట్లాడుతూ.. ఆయా విద్యాసంస్థల్లో కలెక్టర్​ ఆధ్వర్యంలో స.హ. చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ రాష్ట్ర స్పోక్స్​పర్సన్ కాంతపు గంగాధర్, మహిళా న్యాయ సలహాదారులు శ్యామల, మహిళా అధ్యక్షురాలు సునీత, ప్రతినిధులు మహమ్మద్ ఖలీల్, జావిద్, జాఫర్, శ్రీనివాస్, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.