అక్షరటుడే, కమ్మర్పల్లి: Eleti Mahipal Reddy | పట్టణంలో మాజీ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి (Eleti Mahipal Reddy) వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడిపల్లి చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి విగ్రహానికి ఆర్మూర్ మాజీ శాసనసభ్యురాలు అన్నపూర్ణమ్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్ మల్కన్న గారి మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నరసింహారెడ్డి, కమ్మర్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సోమ నరేష్, మండల ఉప అధ్యక్షుడు సతీష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Eleti Mahipal Reddy | ముప్కాల్ మండలంలో..
అక్షరటుడే, ముప్కాల్: దివంగత మాజీ అటవీశాఖ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి వర్ధంతిని ముప్కాల్ మండలంలో (Mupkal Mandal) నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటుక బట్టీ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముస్కు భూమేశ్, ధనేష్ బుమారెడ్డి, లోక రాములు, అశోక్, ముకీద్, నడుకుడ రమేష్, సీఎం రమేష్, ఎన్ నవీన్, ఉన్ని యాదవ్, వాచ్ నర్సయ్య, శ్రీనివాస్ గౌడ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.