అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rice cooker | ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో అన్నం వండటం ఎంత సులభమో అందరికీ తెలుసు. బియ్యం, నీళ్లు వేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు, సమయానికి అన్నం తయారైపోతుంది.
గ్యాస్ స్టవ్ మీద అయితే మాడిపోతుందేమోనని పదే పదే చూడాల్సిన బాధ తప్పుతుంది. అందుకే చాలామంది ఈజీగా ఉంటుందని దీనివైపే మొగ్గు చూపుతున్నారు. కానీ, ఈ సౌలభ్యం వెనుక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Rice cooker | ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకం, అనారోగ్య సమస్యలు:
ప్రస్తుత బిజీ జీవనశైలిలో, టెక్నాలజీపై ఆధారపడటం పెరిగింది. ఈ క్రమంలోనే సులభంగా వంట చేసుకోవడానికి చాలామంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లను ఉపయోగిస్తున్నారు.
అయితే, ఈ పద్ధతిలో వండిన అన్నం తినడం వల్ల కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Rice cooker | ముఖ్యంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు:
క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో అన్నం వండే పాత్రలో అల్యూమినియంను ఉపయోగిస్తున్నారు. దానికి తోడు, కరెంట్ ద్వారా ఉష్ణం ఉత్పత్తి అవ్వడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కానీ, తరచూ ఇందులో వండిన అన్నం తినే వారు చాలా జాగ్రత్త వహించాలి.
మతిమరుపు, మెదడు పనితీరు మందగింపు: అల్యూమినియం పాత్రలో వండిన ఆహారం తీసుకోవడం వలన మెదడు పనితీరు మందగిస్తుంది. దీని ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గి, మతిమరుపు (అల్జీమర్స్) వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
కీళ్ల నొప్పులు: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అన్నం తినడం వల్ల వచ్చే ప్రధాన సమస్యల్లో కీళ్ల సమస్యలు కూడా ఉన్నాయి. దీని ప్రభావంతో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు లేదా మోకాళ్ల నొప్పుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రెషర్ కుక్కర్‌లో (సాధారణంగా గ్యాస్ స్టవ్ మీద వాడే కుక్కర్) వంట చేసేటప్పుడు, నీటి నుంచి ఆవిరి ఏర్పడుతుంది కాబట్టి, వంటకు తగినంత నీటిని పోస్తున్నారో లేదో గమనించుకోవడం ముఖ్యం.
