Artificial Blood | 2030 నాటికి కృత్రిమ రక్తం.. మెడిక‌ల్ షాప్స్‌లో కొనుక్కోవ‌చ్చు..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Artificial Blood | మ‌న శ‌రీరం అద్భుత‌మైన యంత్రంగా చెప్ప‌వ‌చ్చు. ప్రతి అవయవానికి సక్రమంగా రక్తం (Blood) సరఫరా అయితేనే అది సక్రమంగా పనిచేస్తుంది. రక్తం ద్వారానే కణాలకు ఆక్సిజన్, పోషకాలు (oxygen and nutrients) అందుతాయి. శరీరంలో ఏ అవయవం పని చేయాలన్నా రక్తం తప్పనిసరి. బ్లడ్ (Blood) తక్కువగా ఉంటే ఒక్కటి కాదు, అనేక వ్యాధులు మనిషిని వెంటాడతాయి. రక్త ప్రసరణ (blood circulation) సరిగా లేనప్పుడు మన శరీరం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Artificial Blood | మ‌న శ‌రీరం అద్భుత‌మైన యంత్రంగా చెప్ప‌వ‌చ్చు. ప్రతి అవయవానికి సక్రమంగా రక్తం (Blood) సరఫరా అయితేనే అది సక్రమంగా పనిచేస్తుంది.

రక్తం ద్వారానే కణాలకు ఆక్సిజన్, పోషకాలు (oxygen and nutrients) అందుతాయి. శరీరంలో ఏ అవయవం పని చేయాలన్నా రక్తం తప్పనిసరి. బ్లడ్ (Blood) తక్కువగా ఉంటే ఒక్కటి కాదు, అనేక వ్యాధులు మనిషిని వెంటాడతాయి. రక్త ప్రసరణ (blood circulation) సరిగా లేనప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని గుర్తిస్తే సమస్య తీవ్రం కాకుండా నివారించుకునే ఛాన్స్ ఉంటుంది. రక్తం అనేది తెల్ల రక్త కణాలు (white blood cells), ఎర్ర రక్త కణాలు (red blood cells), ప్లాస్మా మరియు ప్లేట్‌లెట్లను (plasma and platelets) కలిగి ఉంటుంది. అందులో ప్రతిదానికి వేరే పనుంది. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ (hemoglobin) కలిగి ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను తీసుకొని రక్తంలో కలుపుతుంది. రక్తం గుండెకు చేరుకొని శరీరం అంతటా పంపు చేయబడుతుంది.

Artificial Blood | త్వ‌ర‌లోనే అందుబాటులోకి..

అయితే రక్త స‌మ‌స్య వ‌ల‌న చాలా మంది ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో మ‌నం చూస్తున్నాం. ఈ క్ర‌మంలో జపాన్‌లోని నారా మెడికల్ యూనివర్సిటీ (Nara Medical University in Japan) శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తం (Artificial Blood) తయారీలో గొప్ప అడుగు వేశారు. ఇది భవిష్యత్తులో అత్యవసర చికిత్సల కోసం ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. అయితే కృత్రిమ ర‌క్తం ఇప్పుడున్న న‌మూనాల క‌న్నా కూడా 24 రెట్లు ఎక్కువ లైఫ్‌ని క‌లిగి ఉంటుంది. ఇది ఒకటే బ్ల‌డ్ గ్రూప్ (blood group) ఉంటుంది. దీనిని అన్ని ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ వారికి ఎక్కించ‌వ‌చ్చు. ఈ కృత్రిమ బ్ల‌డ్ అందుబాటులోకి వ‌స్తే బ్ల‌డ్ డొనేష‌న్ (blood donation) అవ‌స‌రం త‌గ్గుతుంది.

ఇది ఎలా త‌యారు చేస్తారంటే.. జ‌పాన్‌కి చెందిన నారా మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ (Nara Medical University) హిరోమి స‌కాయ్, ఆమె టీం గడువు ముగిసిన ర‌క్తం నుండి హిమోగ్లోబిన్ తీసుకొని వైర‌స్ నిరోధ‌క షెల్‌లో ఉంచి కృత్రిమ రక్తాన్ని (artificial blood) త‌యారు చేస్తారు. ఇది గడువు ముగిసిన కూడా డొనేట్ చేయ‌బ‌డిన బ్ల‌డ్ ప్ర‌యోజ‌నాల‌ని పెంచుతుంది. బ్ల‌డ్ గ్రూపుల‌తో సంబంధం లేకుండా అన్ని గ్రూపుల‌కి కూడా ఈ ర‌క్తం ఎక్కించ‌వ‌చ్చు. స‌కాయ్ ల్యాబ్‌లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ (Clinical Trails) జ‌రుగుతున్నాయి. స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లు 100 నుండి 400 మిల్లీ లీట‌ర్స్ కృత్రిమ ర‌క్తాన్ని తీసుకుంటున్నారు. ర‌క్తం సేఫ్‌, బాగుంది అని నిరూపితం అయితే 2030 నాటికి దీనిని జ‌పాన్ అంతా అమ‌లు చేసే అవ‌కాశం ఉంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది అందుబాటులోకి రానుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...