Homeజిల్లాలుకామారెడ్డిSub Collector Kiranmai | దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

Sub Collector Kiranmai | దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Sub Collector Kiranmai | రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని బాన్సవాడ సబ్ కలెక్టర్ (Banswada Sub Collector Kiranmayi) కిరణ్మయి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహశీల్దార్​ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను ఏ విధంగా పరిశీలిస్తున్నారన్న విషయమై అడిగి తెలుసుకున్నారు.

సదస్సులో వచ్చిన బాబుల్ గావ్ (Babul Gaon), బూర్గుపల్లి (Burgupalli), కాటేపల్లి గ్రామాల బల్క్ దరఖాస్తులపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రెండునెలల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దశరథ్, నాయబ్ తహశీల్దార్ రవి కాంత్, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Must Read
Related News