Homeతాజావార్తలుCM Revanth Reddy | 56 ఏళ్ల వ‌య‌స్సులో ఉత్సాహంగా ప‌రుగులు తీస్తున్న రేవంత్.. ఎంద‌రికో...

CM Revanth Reddy | 56 ఏళ్ల వ‌య‌స్సులో ఉత్సాహంగా ప‌రుగులు తీస్తున్న రేవంత్.. ఎంద‌రికో రోల్ మోడ‌ల్‌గా

మెస్సీ పర్యటన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ఫుట్‌బాల్ పునరుద్ధరణ, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి… అన్నింటికీ కొత్త దారులు చూపనుంది. అంతర్జాతీయ క్రీడాకారుడితో రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌ల‌ప‌డ‌డం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడతో పాటు ఇక్క‌డ పెట్టుబడులకు వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉండ‌డం, విధానాలు, స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌తో రాష్ట్ర అభివృద్ధి సాధ‌న అంశాల‌ని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఈ క్ర‌మంలో ప్రపంచ ఫుట్‌బాల్ సింహాసనంపై నిలిచిన లియోనెల్ మెస్సీ (Lionel Messi) హైద‌రాబాద్ పర్య‌ట‌న అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అర్జెంటీనా మాస్టర్‌ను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అధికారికంగా ఆహ్వానించగా, ఆయన హైదరాబాద్ పర్యటనను మరింత ప్రత్యేకంగా మార్చే ప్లాన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా, మెస్సీతో ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడబోతున్నారన్న వార్తలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.

CM Revanth Reddy | రేవంత్ 7 వర్సెస్ మెస్సీ 7 – ఉప్పల్ స్టేడియంలో అద్భుతం

స్వతహాగా ఫుట్‌బాల్ ప్రేమికుడైన రేవంత్ రెడ్డి, తన మొదటి రోజునుంచే ఇటువంటి ఈవెంట్స్ ద్వారా హైదరాబాద్ గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలని ప్రకటించారు. ఈ క్రమంలో మెస్సీ పర్యటనకు హైదరాబాద్‌ (Hyderabad)ను కూడా చేర్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. మొదట కోల్‌కతా, కొచ్చి, అహ్మదాబాద్ నగరాలు మెస్సీ టూర్‌లో ఉండగా, తరువాత అది ముంబై, ఢిల్లీకి మారింది. ఈ జాబితాలోకి ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరింది. ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో జరగబోయే ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కి అత్యంత హైప్ వచ్చింది. రేవంత్ స్వయంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కూడిన “రేవంత్ 7” జట్టుకు కెప్టెన్‌గా దిగబోతున్నారు. మరోవైపు “మెస్సీ 7”లో ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్‌కు తోడుగా క్రికెట్ ఐకాన్స్ విరాట్ కోహ్లి, శుభమన్ గిల్ కూడా ఆడనున్నట్లు సమాచారం.

56 ఏళ్ల వయసులోనూ సీఎం రేవంత్ ఈ మ్యాచ్ కోసం రాత్రిపూట కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయ‌న ఫిట్‌నెస్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇంత‌గా చెమ‌ట‌లు కారుస్తుండ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. అయితే రేవంత్ రెడ్డి స్పిరిట్‌ని చూశాక నేటి యువ‌త చాలా మంది కూడా క్రీడ‌ల‌పై ఆస‌క్తి చూపాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైన ఉంది. హైదరాబాద్‌ను ఐటీ, కల్చరల్ హబ్ మాత్రమే కాకుండా క్రీడా–ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న రేవంత్ ఫోకస్‌లో ఇది భాగమంటున్నారు విశ్లేషకులు. సీఎం రేవంత్ కలల ప్రాజెక్ట్ అయిన “ఫ్యూచర్ సిటీ”లో భారీ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. మెస్సీ పర్యటన ఈ ప్రాజెక్టులకు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.

ఫుట్‌బాల్ చరిత్రలో అత్యున్నత స్థానం సంపాదించిన మెస్సీ, హైదరాబాద్‌కు రావడం వల్ల తెలంగాణలో ఈ క్రీడకు పునరుజ్జీవనాన్ని అందించే పెద్ద ఉత్సాహం కలిగించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

Must Read
Related News