అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy fire on KCR | ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ (KCR) శుక్రాచార్యుడిగా పన్నాగాలు చేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా.. ఏదులాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఒకవైపు కేసీఆర్ శుక్రాచార్యుడిగా పన్నాగాలు పన్నుతుంటే… మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ మారుచిడిలా రాష్ట్రంలో తిరుగుతూ.. ప్రభుత్వానికి అడ్డుతగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy fire on KCR | నేతలపై బురద జల్లే ప్రయత్నాలు
సింగరేణి బొగ్గు గనుల టెండర్ల (Singareni coal mine tenders) ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలకు స్థానం లేదన్నారు. అయితే మీడియా ఛానళ్ల మధ్య ఉన్న పంచాయితీని మా పార్టీ నేతలపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలపై ఆరోపణలుంటే నేరుగా తన వద్దకు రావాలన్నారు. తాను వివరణ ఇస్తానని.. అలా కాకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సింగరేణి కోల్ మైనింగ్‌లో అవినీతికి అవకాశం లేదన్నారు.