అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lionel Messi | ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అమోఘమైన స్థానాన్ని సంపాదించిన లియోనల్ మెస్సీ తొలిసారి భారతదేశ పర్యటనకు రానుండడం క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. .ఃGOAT India Tour 2025 లో భాగంగా మెస్సీ 2025 డిసెంబర్ 13న హైదరాబాద్ (Hyderabad) వస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు.
ఈ నేపథ్యంలో నగరంలో ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెస్సీ రాకపై ప్రత్యేక ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ.. “2025 డిసెంబర్ 13న మెస్సీకి (Lionel Messi) మా హైదరాబాద్‌లో ఆతిథ్యం ఇవ్వడాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మా నేలకు మీలాంటి లెజెండ్ రావడం ప్రతి ఫుట్‌బాల్ అభిమానికీ ఉత్తేజ క్షణం అని పేర్కొన్నారు.
అంతేకాక, ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో (Uppal Cricket Stadium) జరగబోయే GOAT Cup ఫ్రెండ్లీ సాకర్ మ్యాచ్ కోసం నగరం పూర్తిగా సిద్ధమవుతోందని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ యాక్షన్ – 13 డిసెంబర్, సాయంత్రం 7 నుంచి 8:45 వరకు ఉంటుంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సీ డిసెంబర్ 13 సాయంత్రం 7.00 గంటల నుంచి 8.45 వరకు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ప్రత్యేక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొంటారు. ఈ మ్యాచ్ ప్రత్యేకత ఏంటంటే.. మెస్సీతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడబోతున్నారు.
- RR9 vs LM10 — అరుదైన కాంబినేషన్!
- సీఎం రేవంత్ రెడ్డి – జెర్సీ నంబర్ RR9
- లియోనల్ మెస్సీ – జెర్సీ నంబర్ LM10
సీఎం రేవంత్ గతంలో కూడా ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దిగ్గజ ఆటగాడితో ఒకే గ్రౌండ్‌లో అడుగుపెడుతుండడం అభిమానుల్లో భారీ ఉత్సాహం కలిగిస్తోంది.
Lionel Messi | మెస్సీ రాకతో హైదరాబాద్ ‘స్పోర్ట్స్ హబ్’ దిశగా..
మెస్సీ పర్యటన వల్ల హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కి వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, రాష్ట్ర ప్రభుత్వం (State Government) “Telangana Rising” కార్యక్రమానికి మెస్సీని బ్రాండ్ అంబాసడర్‌గా నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ టికెట్లు ఇప్పుడు Zomato District App లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ క్రీడాభిమానులకు ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన అవకాశం.
మొత్తం మీద… లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనతో నగరం ప్రపంచ ఫుట్‌బాల్ మ్యాప్‌పై నిలబడబోతోంది. స్పోర్ట్స్ ప్రేమికులు, మెస్సీ అభిమానులు, రాజకీయ వర్గాలు అందరి చూపులు ఇప్పుడు ఉప్పల్ క్రికెట్ స్టేడియంపై కేంద్రీకృతమయ్యాయి.
