Homeతాజావార్తలుHarish Rao | రేవంత్ అన్ని వర్గాలను మోసం చేసిండు.. మాజీ మంత్రి హరీశ్ రావు...

Harish Rao | రేవంత్ అన్ని వర్గాలను మోసం చేసిండు.. మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్​ ఇప్పుడు ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. అందోల్​లో సోమవారం ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) అన్ని వర్గాలను మోసం చేసిండని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

పథకాలు అమలు చేయడానికి పైసలు లేవంటున్న ముఖ్యమంత్రి లక్ష కోట్లతోని మూసీ సుందరీకరణ పనులు చేపడతాట అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో అందోల్ లో నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో (Alai Balai program) హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలన అంటే ఏమిటో ప్రజలకు అర్థమైందని, అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పోవాలె కేసీఆర్ రావాలె అంటున్నారని చెప్పారు.

Harish Rao | హామీల అమలేది?

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిందని హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి మాట తప్పారని, రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి డిక్లరేషన్లు విడుదల చేశారన్నారు. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. నమ్మించి మోసం చేసి ప్రజల గుండెల మీద తన్నిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రూ.4 వేల పింఛన్ (pension) ఎటు పోయింది? కొత్త పింఛన్లు ఇవ్వకపోగా, 2 లక్షల పింఛన్లను తొలగించారని మండిపడడ్ారు. తులం బంగారం ఇస్తామన్నారు. స్కూటీలు ఇస్తామని మాట ఇచ్చారు. ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్నారు. ఇలా ఎన్నో చెప్పి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు.

Harish Rao | గజనీ రేవంత్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసిండని మాజీ మంత్రి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రజినీ కాంత్, ఎన్నికల తర్వాత గజినీ కాంత్ అని అభివర్ణించారు. ‘‘పథకాలు అమలు చేయమంటే పైసలు లేవని చెబుతుండు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వమేంట పైసలు లేవంటుండు. కాలేజీలకు, ఆస్పత్రులకు (colleges and hospitals) ఇచ్చేతందుకు పైసల్లేవని అంటుండు.

మరోవైపు, లక్షా యాభై వేల కోట్లతో ఫ్యూచర్ సిటీ (Future City) కడుతా అంటుండు. లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేస్తా అని చెబుతుండు. పథకాలకు లేని పైసలు మూసీ సుందరీకరణకు ఎలా వస్తాయని’’ ప్రశ్నించారు. హైదరాబాద్ నగరానికి (Hyderabad city) మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తా అని ముఖ్యమంత్రి చెబుతుండని, కాళేశ్వరం కూలింది అని చెబుతూనే మళ్లీ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తా అంటాడని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ మీ అయ్య కట్టిండా, కేసీఆర్ శ్రమ కాదా? అని ప్రశ్నించారు.

Harish Rao | ఢిల్లీకి మూటలు మోస్తుండు..

రాష్ట్రాన్ని గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ, బెంగళూరు, బీహార్ అంటూ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కమీషన్లు వచ్చే పనులు మాత్రమే మొదలు పెడుతుండు. వచ్చిన డబ్బుల మూటలను ఢిల్లీకి (Delhi) తరలిస్తుండని మండిపడ్డారు. బోనస్ పేరిట రైతులను వంచించి, రూ.1300 కోట్లు ఇవ్వలేదన్నారు. 47శాతం మందికే రుణం చేసి 53శాతం మందికి రుణ మాఫీ ఎగ్గొట్టిండన్నారు. మాట ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో ఓటు వేయమని వచ్చే కాంగ్రెస్ లీడర్లను హామీలపై నిలదీయాలని కోరారు.

Must Read
Related News