అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rachakonda Police | ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికి పదవీవిరమణ సహజమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు (Rachakonda Police Commissioner Sudheer Babu) అన్నారు. ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో (Uppal Traffic Police Station) ఏఎస్సైగా విధులు నిర్వహించిన పులి శ్రీనివాస్ (ASI Puli srinivas) గతనెల పదవీవిరమణ పొందారు. దీంతో మంగళవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ పులి శ్రీనివాస్ శేషజీవితం ప్రశాంతంగా ఆనందంగా గడపాలని సూచించారు. డీసీపీ రోడ్ సేఫ్టీ అధికారి కసిరె మనోహర్, ఏసీపీ శ్రీనివాస్ రావు, అడ్మిన్ ఇందిరా, డీసీపీ శివకుమార్, ఉప్పల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ (Uppal Law and Order Police Station) ఎస్హెచ్వో ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి, ఎస్హెచ్వో నాగరాజు, కూకట్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్, అదనపు ఇన్స్పెక్టర్ బాబియా నాయక్, ఏఆర్ఎస్సై వెంకటేశం, ఆర్ఐ మల్లేశం, సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్సైలు, ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ సిబ్బంది, చిన్ననాటి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.