అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangham | పట్టణ ఆర్యవైశ్య సంఘంలో గెలిచిన వారిపై బాధ్యత మరింత పెరిగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య పట్టణ సంఘం (Arya Vaishya Urban Association), అనుబంధ సంఘాల అధ్యక్షులు శనివారం ఎమ్మెల్యేను కలిశారు.
Arya Vaishya Sangham | హామీలను అమలు చేయాలి..
ఈ సందర్భంగా ఆయా ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంఘం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.
Arya Vaishya Sangham | ప్రలోభాలకు గురిచేసినప్పటికీ..
అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు (Arya Vaishya Sangam President) ధన్పాల్ శ్రీనివాస్ (Dhanpal Srinivas) మాట్లాడుతూ.. ప్రత్యర్థులు ఓటర్లను ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు. గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఆర్యవైశ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు ఇంగు శివప్రసాద్, పాల్తి రవికుమార్, ఇల్లందు సుధాకర్, లిఖిత్, వివేకానంద, నవీన్ తదితరులు పాల్గొన్నారు.