అక్షరటుడే, వెబ్‌డెస్క్ : C-Mitra | సైబర్ నేరాల భారీన పడిన వారికి అండగా ఉండేందుకు పోలీసులు ‘సీ–మిత్ర’ సేవలు (‘C-Mitra’ service) ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి మంచి స్పందన వస్తోంది.
సైబర్ నేరాల్లో (cybercrimes) మోసపోయిన వారు టోల్ ఫ్రీ నంబర్, సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. దీంతో వారికి సాయం చేయడానికి, ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ‘సీ–మిత్ర’ను పోలీసులు తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అమల్లోకి వచ్చిన కేవలం పది రోజుల్లోనే వందల మందికి సీ –మిత్ర భరోసా ఇచ్చింది. సీ–మిత్ర పోలీసులు (C-Mitra police) 1000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను తెలుసుకుంది.
C-Mitra | 100 ఎఫ్ఐఆర్లు నమోదు
బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) సాయంతో 200 మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి పంపింది. వారి నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే.. ఎక్కడా జాప్యం లేకుండా 100 కిపైగా ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. గంటల తరబడి స్టేషన్లలో పనిలేకుండా, నిమిషాల్లోనే వర్చువల్ పోలీసులు స్పందిస్తుండటం, ఎఫ్ఐఆర్ కాపీలు నేరుగా మొబైల్‌కే వస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.