Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | శబరిమాత ఆశ్రమంలో విజయదశమి ఏర్పాట్లపై తీర్మానాలు

Kamareddy | శబరిమాత ఆశ్రమంలో విజయదశమి ఏర్పాట్లపై తీర్మానాలు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమంలో (Sabarimata Ashram) విజయదశమి సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆశ్రమ ట్రస్ట్‌ కమిటీ సభ్యులు పలు తీర్మానాలు చేశారు. ఈ మేరకు ఆశ్రమంలో ట్రస్ట్‌ కమిటీ అధ్యక్షుడు అనంతరావు (Ananth Rao) ఆధ్వర్యంలో శుక్రవారం ట్రస్ట్‌ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశ్రమ అభివృద్ధి, అన్నదానం, అమ్మవారి నిత్యపూజ (Ammavari Nithya Pooja), తదితర కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాతాజీ విజయదశమిన మహా సమాధి దీక్షకు వెళ్లి తిరిగి కార్తీక పౌర్ణమికి (Kartika Pournami) దర్శనం ఇచ్చి భక్తుల కోర్కెలు తీరుస్తారని కమిటీ సభ్యులు తెలిపారు.

అమ్మవారి భక్తులు, శిష్యులు నిత్యాన్నదాన, ఆశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో ఆర్థిక సహాయ, సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ గౌరవాధ్యక్షుడు వేముల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి నేతి కృష్ణమూర్తి, కోశాధికారి దూడం శ్రీనివాస్, గ్రామపెద్దలు బాలకిషన్‌ రావు, రాఘవరెడ్డి, డా నర్సింలు, రనీల్‌ రెడ్డి, రాంశంకర్, సాంస్కృతిక కార్యదర్శి లక్ష్మీనారాయణ, భరద్వాజ్, శంకర్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News