అక్షరటుడే, కామారెడ్డి: Municipal Reservations | మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓటరు తుదిజాబితా విడుదల చేయగా తాజాగా మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 92 వార్డులు ఉన్నాయి.
Municipal Reservations | జిల్లాలో..
కామారెడ్డిలో 49, బాన్సువాడ (banswada)లో 19, ఎల్లారెడ్డిలో (Yellareddy) 12, బిచ్కుందలో 12 వార్డులున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) లో 99,313 మంది ఓటర్లు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 13,265 మంది, బాన్సువాడ మున్సిపాలిటీలో 24,188 మంది, బిచ్కుంద మున్సిపాలిటీలో 12,759 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఈ మున్సిపాలిటీలలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
Municipal Reservations | మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఇలా..
కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులుండగా అందులో జనరల్ మహిళ – 13, జనరల్ – 12, బీసీ మహిళ -9, బీసీ జనరల్ -10, ఎస్సీ మహిళ 2, ఎస్సీ జనరల్ 2, ఎస్టీ జనరల్ 1 బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులలో జనరల్ మహిళ 5, జనరల్ 5, బీసీ మహిళ 3, బీసీ జనరల్ 3, ఎస్సీ మహిళ 1, ఎస్సీ జనరల్ 1, ఎస్టీ జనరల్ 1, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులలో జనరల్ మహిళ 4, జనరల్ 2, బీసీ మహిళ 1, బీసీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, ఎస్సీ జనరల్ 1, ఎస్టీ జనరల్ 1, బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డుల్లో జనరల్ మహిళ 4, జనరల్ 2, బీసీ మహిళ 1, బీసీ జనరల్ 2, ఎస్సి మహిళ 1, ఎస్సీ జనరల్ 1, ఎస్టీ జనరల్ 1 స్థానాలు కేటాయించారు. ప్రస్తుతం వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది.
Municipal Reservations | మహిళలకు రిజర్వేషన్లు ఇలా..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు భారీగా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి మున్సిపాలిటీలో అత్యధికంగా మహిళలకు స్థానం కల్పించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డుల్లో 24 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించగా బాన్సువాడలో 19 వార్డుల్లో 9 స్థానాలు, ఎల్లారెడ్డిలో 12 వార్డులలో 6, బాన్సువాడలో 12 వార్డులలో 6 స్థానాల చొప్పున కేటాయించారు.