Homeజిల్లాలునిజామాబాద్​Armoor | సర్పంచ్​ అభ్యర్థి నామినేషన్​ను పరిగణనలోకి తీసుకోవాలి

Armoor | సర్పంచ్​ అభ్యర్థి నామినేషన్​ను పరిగణనలోకి తీసుకోవాలి

జక్రాన్​పల్లి మండలంలో మునిపల్లి సర్పంచ్ అభ్యర్థి చింతలగోపి నామినేషన్​ను పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్​ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | జక్రాన్​పల్లి మండలంలో (Jakranpalli Mandal) మునిపల్లి సర్పంచ్ అభ్యర్థి చింతల గోపి నామినేషన్​ను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) కోరారు. ఈ మేరకు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్​ మాల్వియాకు (Sub-Collector Abhigyan Malviya) వినతిపత్రం అందజేశారు.

సర్పంచ్ అభ్యర్థిగా (Sarpanch Candidate) చింతలగోపి నామినేషన్ దాఖలు చేశారన్నారు. సదరు వ్యక్తి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నట్లుగా ఫిర్యాదు రాగా గోపి నామినేషన్​ పత్రాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారని వివరించారు. గోపి ఉద్యోగం మానేసి చాలా రోజులైందని.. వెంటనే అతడి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మునిపల్లి గ్రామంలో పాత రిజర్వేషన్లే ఖరారు చేయడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి (Congress Party) పోటీదారులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.

Must Read
Related News