అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashaali Mahila Sangham | పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను జిల్లా పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లా మహిళా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు చాట్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్‌ను సన్మానించారు.
అనంతరం మహిళా సంఘం ప్రతినిధులు సంఘానికి సంబంధించి పలు సమస్యలను వివరించి పరిష్కారానికి కృషి చేయాలని మహేష్ కుమార్ గౌడ్‌ను కోరారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం, సెంట్రల్ కమిటీ సభ్యులు దాసరి నర్సింలు (Dasari Narsimlu), జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మైసల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు గంగా ప్రసాద్, సహాయ కార్యదర్శి పద్మ సుభాష్, మహిళా సంఘం ఉపాధ్యక్షులు బైస రమాదేవి, ప్రచార కార్యదర్శి గిరిజ, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.