అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Ponguleti | స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కూకట్పల్లి (Kukatpally)లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం అందుకు నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వంపై భారం లేకుండా ప్రైవేట్ బిల్డర్స్ సహకారంతో సమీకృత భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఐదేళ్ల పాటు వాటి నిర్వహణను సైతం బిల్డర్లే చూసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆలోచనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ శాఖను అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టామన్నారు. కూకట్పల్లి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎస్.ఎస్.ఆర్ బిల్డర్స్ నిర్మిస్తుందని మంత్రి తెలిపారు.
Minister Ponguleti | ఆధునిక సౌకర్యాలతో..
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను (Sub-Registrar Offices) నిర్మిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో, మూడో విడతలో నియోజకవర్గ కేంద్రాలలో సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు. తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా కాకుండా సేవా కేంద్రంగా చూస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatela Rajender), కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.