అక్షరటుడే, మెండోరా: Sriramsagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు (Sriramsagar Project) ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గింది. దీంతో బుధవారం ఉదయం 16 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు.. మధ్యాహ్నానికి గేట్ల సంఖ్యను తగ్గించారు. ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి గోదావరిలోకి (Godavari) నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 35,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 34,790 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.90 అడుగులకు (80.053 టీఎంసీలు) చేరింది.
Sriramsagar | కాల్వల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా నీటి విడుదలను అధికారులు కొనసాగిస్తున్నారు. కాకతీయ కాలువ (Kakatiya kaluva) ద్వారా 4,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 709 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది.
Sriramsagar | అప్రమత్తంగా ఉండాలి
ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో గోదావరి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, చేపల వేటగాళ్లు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అలాగే అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటి విడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.