అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 34,604 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్‌కు వరద వస్తుండడంతో వరద గేట్ల ద్వారా 32,820 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1404.9 అడుగుల (17.7 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా ఎగువన సింగూరు నుంచి ప్రవాహం తగ్గింది. దీంతో దిగువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఫలితంగా నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో (Inflow) క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
Nizam Sagar | పోచారం ప్రాజెక్ట్‌లోకి..
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌కు (Pocharam project) స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 2905 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లోకి 27.4 టీఎంసీల నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.