అక్షరటుడే, ఇందూరు: Red cross Society | జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షుడు వినయ్ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) రెడ్‌క్రాస్ బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలను (Gram Panchayat elections) దిగ్విజయంగా నిర్వహించినందుకు సొసైటీ సభ్యులు పూలమొక్క ఇచ్చి అభినందనలు తెలిపారు.
Red cross Society | రెడ్‌క్రాస్ సేవలపై వివరణ..
ఈ సందర్భంగా వారు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను కలెక్టర్‌కు వివరించారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు (blood donation camps).. వాటిద్వారా బాధితులకు అందిస్తున్న సేవలను కలెక్టర్‌కు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి రవీందర్, జూనియర్ రెడ్‌క్రాస్ సమన్వయకర్త అబ్బాపూర్ రవీందర్, పీఆర్వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.