ePaper
More
    HomeతెలంగాణKphb Open Plots | బాబోయ్.. కేపీహెచ్‌బీలో గజం రూ.2.98లక్షలు..

    Kphb Open Plots | బాబోయ్.. కేపీహెచ్‌బీలో గజం రూ.2.98లక్షలు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kphb Open Plots | కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీలో జరిగిన ఓపెన్ భూముల వేలంలో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ వేలంలో రికార్డు స్థాయిలో రూ.141.36 కోట్ల ఆదాయం సమకూరింది.

    పశ్చిమ డివిజన్‌ హౌసింగ్‌బోర్డు అధికారులు నిర్వహించిన ఈ వేలంలో 198 గజాల నుంచి 987 గజాల విస్తీర్ణం కలిగిన 18 ఇళ్ల స్థలాలను 87 మంది పోటీదారులు దక్కించుకున్నారు. మొత్తం 6,236.33 గజాల స్థలాలు విక్రయించబడ్డాయి. హౌసింగ్‌బోర్డు కమిషనర్‌ గౌతమ్‌ (Housing Board Commissioner Gautam) తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ-హైటెక్ సిటీ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడింది.

    Kphb Open Plots | అంత రేట్లు ఏంటి?

    ఒక కమర్షియల్‌ ప్లాట్‌ ధర గజం రూ.2.98 లక్షలు పలికింది. చదరపు గజం ధర ఇంత భారీగా పలకడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారని రాష్ట్ర గృహ నిర్మాణ మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎండీ ఐఏఎస్‌ వి.పి.గౌతమ్‌ తెలిపారు. హౌసింగ్‌ బోర్డు పరిధిలో కేపీహెచ్‌బీ కాలనీ (KPHB Colony) ఫేజ్‌-7లో ఖాళీగా ఉన్న 18 స్థలాలకు బుధవారం కేపీహెచ్‌బీ ఫంక్షన్‌ హాల్‌లో వేలం నిర్వహించారు. వీటిలో నాలుగు నివాస స్థలాలు కాగా.. 13 వాణిజ్య క్యాటగిరి, కైతలాపూర్‌(Kaithalapur)లో ఉన్న బిట్టుతో కలిపి మొత్తం 18 స్థలాలు. వేలంలో ఇవన్నీ.. అధికారుల అంచనాలకు మించి హాట్‌ కేకుల్లా Hot cakes అమ్ముడైపోయాయి. ఈ ప్లాట్లలో 194 చదరపు గజాల నుంచి 978 చదరపు గజాల వరకూ రకరకాల విస్తీర్ణం గ లవి ఉన్నాయి.

    వేలం మార్గదర్శకాల ప్రకారం.. విజయవంతమైన బిడ్డర్లు మొత్తం మొత్తంలో 25 శాతం రెండు రోజుల్లోపు చెల్లించాలి. ఈ అడ్వాన్స్ హౌసింగ్ బోర్డుకు తక్షణ ఆదాయంలో రూ.35.34 కోట్లను తెస్తుందని అంచనా. ఈ వేలం విజయం నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలు మరియు ప్రణాళికాబద్ధమైన కాలనీలలో భవిష్యత్తులో భూమి అమ్మకాలకు నాంది పలుకుతుందని అధికారులు తెలిపారు.

    కాగా.. కేపీహెచ్‌బీలో KPHB గజం రూ.2.98 లక్షలు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2000- 01 మధ్య గజం ధర కేవలం రూ.1,818 ఉండగా.. 25 ఎళ్లలో లక్షల్లోకి చేరుకుంది. అప్పట్లో భూములు కొన్నవారు ధరల పెరుగుదల చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవిధంగా ఇది కేపీహెచ్‌బీ ప్రాంతంలో స్థిరాస్తి విలువలు ఏ స్థాయిలో పెరిగాయో స్పష్టం చేస్తోంది.

    More like this

    Medak | రెండేళ్ల కుమార్తెను చంపి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medak | మానవ సంబంధాలు మంట గలిసిపోయాయి. ప్రేమ, వివాహేతర సంబంధాల కోసం కొంత...

    Godavari Pushkaras | దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Godavari Pushkaras | గోదావరి పుష్కరాలను దక్షిణ భారత South Indian కుంభమేళా Kumbh Mela...

    Road Transport Department | వాహనదారులకు అలెర్ట్​.. ఇక వాటిని తప్పక ఏర్పాటు చేసుకోవాల్సిందే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Road Transport Department | రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) ఎక్కువ శాతం రాత్రి...