ePaper
More
    HomeతెలంగాణBalmuri Venkat | కాంగ్రెస్​లో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు: బల్మూరి వెంకట్​

    Balmuri Venkat | కాంగ్రెస్​లో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు: బల్మూరి వెంకట్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Balmuri Venkat | కాంగ్రెస్​(Congress Party)లో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని.. ఇందుకు తానే ఉదాహరణ అని పార్టీ జిల్లా అబ్జర్వర్​ బల్మూరి వెంకట్(District Observer Balmuri Venkat)​ అన్నారు. డిచ్​పల్లిలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 4 నుంచి 10లోపు నియోజకవర్గ, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ‘జై బాపు..జై భీమ్‌.. జై సంవిధాన్‌’కు సంబంధించి జిల్లాస్థాయిలో బహిరంగ సభ నిర్వహించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి(MLA Sudarshan Reddy) మాట్లాడుతూ .. పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేలా పనిచేసేవారికి సస్పెండ్​ చేస్తామని హెచ్చరించారు.

    కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార సంస్థ ఛైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, అర్బన్‌ ఇన్‌ఛార్జి సత్యనారాయణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్​ ఛైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్‌ కాసుల బాలరాజ్​, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్, నర్సారెడ్డి, ఆకుల లలిత, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌ రెడ్డి, నుడా ఛైర్మన్‌ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఐడీసీఎంఎస్‌ తారాచంద్, ఆర్మూర్, బాల్కొండ ఇన్‌ఛార్జీలు వినయ్‌ రెడ్డి, సునీల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...