అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్‌లో మరో రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అందరు చూస్తుండగా నిందితులు రియల్టర్‌ను తుపాకితో కాల్చి, కత్తులతో పొడిచి హత్య చేశారు. రియల్టర్ వెంకటరత్నం స్కూటీపై వెళ్తున్నాడు. అతడిని దుండగులు వెంబడించారు. సాకేత్ కాలనీలోని ఫోస్టర్ స్కూల్ (Foster School) సమీపంలోకి రాగానే అతడిపై దాడి చేశారు. నడిరోడ్డుపై షూట్ చేశారు. అనంతరం కత్తులతో పొడిచి హత్య చేశారు.
Hyderabad | కేసు నమోదు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంకటరత్నంను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో బుల్లెట్‌తో పాటు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కాగా వెంకటరత్నంపై ధూల్‌పేట్ (Dhulpet)లో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు.
Hyderabad | వరుస ఘటనలు
నగరంలో ఇటీవల హత్యలు, దాడులు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ (Rain Bazaar Police Station) పరిధిలో సైతం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్‌కు చెందిన మహమ్మద్ జునైద్ (30)ను బుధవారం అర్ధరాత్రి దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.