- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Kotagiri | ‘డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం’

Kotagiri | ‘డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం’

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి : Kotagiri | డబుల్ బెడ్​రూం ఇళ్ల లబ్ధిదారుల నుంచి తాము డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్(Former Sarpanch Patti Lakshman) పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గం డబుల్ బెడ్​రూం ఇళ్ల(Double Bedroom House) నిర్మాణంలో రాష్ట్రంలో నెంబర్​వన్​గా నిలిచిందన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా మూడు విడతలుగా బిల్లులు ఇచ్చారన్నారు.

- Advertisement -

అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూం బిల్లుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని, ప్రభుత్వం నుంచి రూ.25కోట్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ బిల్లులు వచ్చే విధంగా చూస్తామన్నారు. ఎవరికైనా బిల్లులు రాకపోతే ఏఈతో మాట్లాడి బిల్లు వచ్చేవిధంగా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో విండో ఛైర్మన్ కూచి సిద్దు, కాంగ్రెస్​ నాయకులు శ్రీధర్, హాగిరావు పటేల్, బీర్కూరు సంతోష్, భీమ్​రావు, దినేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News