అక్షరటుడే, వెబ్డెస్క్ : Repo Rate | ఆర్బీఐ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. మరోసారి రెపోరేటు తగ్గించింది. ప్రస్తుతం రెపోరేటు 5.5శాతం ఉండగా.. 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 5.25 శాతానికి చేరింది.
ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) శుక్రవారం ఉదయం వివరాలు వెల్లడించారు.ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఇటీవల జరిగింది. మూడు రోజుల సమావేశం తర్వాత అనంతరం రెపోరేటు తగ్గించాలని నిర్ణయించినట్లు గవర్నర్ తెలిపారు. కాగా ఈ ఏడాది నాలుగో సారి ఆర్బీఐ (RBI) రెపోరేట్లను తగ్గించడం గమనార్హం. దీంతో వివిధ రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ భారం తగ్గనుంది.
Repo Rate | ద్రవ్యోల్బణం తగ్గడంతో..
దేశంలో కొంతకాలంగా ద్రవ్యోల్బణం తగ్గుతోంది. దీంతో ఆర్బీఐ రెపో రేట్లలో కోత పెడుతోంది. ఫిబ్రవరి, ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్ చొప్పున తగ్గించింది. జూన్లో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో 25 బేసిస్ పాయింట్లను తగ్గించడం గమనార్హం. దీంతో ఈ ఏడాది మొత్తంగా 1.25 శాతం రెపో రేటు దిగి వచ్చింది.
Repo Rate | వీరికి లాభం
రెపో రేటు తగ్గింపుతో ప్రజలకు మేలు జరగనుంది. గృహ, వాహన, ఇతర రుణాలు తీసుకున్న వారికి వడ్డీ భారం తగ్గనుంది. దీంతో ఈఎంఐలు సైతం తగ్గనున్నాయి. అయితే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ (Floating Interest) విధానం ఎంచుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఫిక్స్డ్ వడ్డీ విధానం ఎంచుకుంటే.. వడ్డీ తగ్గే అవకాశం లేదు. కొత్తగా రుణాలు తీసుకునే వారికి సైతం రెపో రేటు తగ్గింపుతో తక్కువ వడ్డీకి లోన్లు లభించనున్నాయి. అలాగే ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit) చేసే వారికి ఈ నిర్ణయంతో నష్టం జరగనుంది. వడ్డీ రేట్లు తగ్గడంతో వారికి రిటర్న్స్ తగ్గే అవకాశం ఉంది.
