Homeబిజినెస్​Stock Market | ప్రధాన సూచీలకు ఆర్‌బీఐ ఊతం.. లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market | ప్రధాన సూచీలకు ఆర్‌బీఐ ఊతం.. లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు వరుసగా రెండో రోజూ లాభాల బాటలో పయనించాయి. ఐటీ సెక్టార్‌లో జోష్‌ కొనసాగింది. సెన్సెక్స్‌ 447 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో ముగిశాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market)లు వరుసగా రెండో రోజూ లాభాల బాటలో పయనించాయి. ఐటీ సెక్టార్‌లో జోష్‌ కొనసాగింది. సెన్సెక్స్‌ 447 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో ముగిశాయి.

ఆర్‌బీఐ (RBI) వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించడం, లిక్విడిటీ పెంచడానికి చర్యలు తీసుకోవడంతో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 140 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 34 పాయింట్ల నష్టంతో ప్రారంభమై లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ రేట్‌కట్‌ను ప్రకటించాక పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 85,078 నుంచి 85,796 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,985 నుంచి 26,202 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌ 447 పాయింట్ల లాభంతో 85,712 వద్ద, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 26,186 వద్ద స్థిరపడ్డాయి. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ లాభపడినా.. స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో నష్టాలు కంటిన్యూ అయ్యాయి.

పీఎస్‌యూ బ్యాంక్‌, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు..

బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ స్టాక్స్‌ రాణించాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.42 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.90 శాతం, బ్యాంకెక్స్‌ 0.86 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.84 శాతం, మెటల్‌ 0.74 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.62 శాతం లాభపడ్డాయి. సర్వీసెస్‌ ఇండెక్స్‌ 0.57 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.42 శాతం, ఇండస్ట్రియల్‌ 0.27 శాతం నష్టపోయాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.51 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.21 శాతం పెరగ్గా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.67 శాతం నష్టపోయింది.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,805 కంపెనీలు లాభపడగా 2,342 స్టాక్స్‌ నష్టపోయాయి. 181 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 91 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 304 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ఉండగా.. 6 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎస్‌బీఐ 2.46 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.08 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.89 శాతం, మారుతి 1.80 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.68 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్‌యూఎల్‌ 3.51 శాతం, ఎటర్నల్‌ 1.15 శాతం, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ 0.83 శాతం, సన్‌ఫార్మా 0.75 శాతం, ట్రెంట్‌ 0.61 శాతం నష్టపోయాయి.

Must Read
Related News