అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మున్సిపల్ ఇన్ఛార్జిగా (Municipal In-Charge) రవిబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ డిప్యుటీ కమిషనర్ (Nizamabad Deputy Commissioner)గా పనిచేస్తున్న ఆయనను ఆర్మూర్ ఇన్ఛార్జి కమిషనర్గా నియమించారు.
దీంతో ఆయన మంగళవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఇటీవల ఏసీబీ అధికారులకు (ACB Officers) పట్టుబడిన విషయం తెలిసిందే. రవి బాబు బాధ్యతలు స్వీకరించగా.. మున్సిపల్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
