HomeసినిమాRashmika Mandanna | విజ‌య్‌తో పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన ర‌ష్మిక‌.. ఫిబ్ర‌వ‌రిలోనే పెళ్లి?

Rashmika Mandanna | విజ‌య్‌తో పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన ర‌ష్మిక‌.. ఫిబ్ర‌వ‌రిలోనే పెళ్లి?

ర‌ష్మిక‌, విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి విష‌యం చాలా సీక్రెట్‌గా ఉంటుంది. పెళ్లి నెల ఫిబ్రవరేనా?,ఎక్కడ జరగనుంది?, సెలబ్రిటీ-ఫ్రెండ్స్ లిస్ట్ ఏంటి? అన్న వివరాలు రాబోయే రోజుల్లో బయటపడే అవకాశముంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rashmika Mandanna | టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం రష్మిక మందన్నా , విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రేమ‌, పెళ్లి. ఈ ఇద్దరి ప్రేమ, సంబంధం, సీక్రెట్ హాలిడేలు, కుటుంబాలతో కలిసి ఉన్న ఫోటోలు… ఇలా అనేక విషయాలు సోషల్ మీడియాలో ఊహాగానాలను పెంచాయి.

వచ్చే ఏడాది ఫిబ్రవరి (February)లో వీరి పెళ్లి జరగనుందంటూ వచ్చిన వార్తలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా రష్మిక స్పందించారు. ఆమె తాజా వ్యాఖ్యలు మాత్రం ఈ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ కాకుండా… ఇంకాస్త స‌స్పెన్స్ క్రియేట్ చేశాయి. ఓ హాలీవుడ్ మీడియా (Hollywood Media) సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. నేను ఈ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేను. ఖండించాలనే ఉద్దేశ్యం కూడా లేదు. పెళ్లి గురించి మాట్లాడాల్సిన సరైన సమయం వస్తే… అందరికీ చెబుతాను. ఇప్పుడైతే అంతకుమించి చెప్పలేను అని పేర్కొంది.

Rashmika Mandanna | త్వ‌ర‌లోనే పెళ్లి..

ఈ ఒక్క సమాధానం సోషల్ మీడియా (Social Media)లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇప్పటి వరకు పెళ్లి రూమర్లపై రష్మిక నేరుగా స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నా… ఇలా ఓపెన్-ఎండెడ్ ఆన్సర్ ఇవ్వడం ఇదే మొదటిసారి. నా పర్సనల్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అని రష్మిక తన వ్యక్తిగత జీవితంపై కామెంట్ చేసింది. బయట పర్సనల్ విషయాలను పంచుకోను, నా పర్సనల్ లైఫ్‌ను చాలా ప్రైవేట్‌గా చూసుకుంటాను అని పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు.ఖండించలేదు అంటే.. ఏదో ఉంది అంటేనే కదా!”, ఫిబ్రవరిలో పెళ్లి రూమర్ నిజం కావచ్చేమో, రష్మిక సమాధానం క్లియర్ గా హింట్ ఇచ్చేసింది. అంటూ కామెంట్ చేశారు.

ఇదే ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. “ఈ ఏడాది నా ఐదు సినిమాలు వచ్చినా… ప్రతీదానికీ మంచి స్పందన వచ్చింది. భాష, జానర్ అనే హద్దులు లేకుండా విభిన్న పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చాను. ప్రేక్షకులు స్వీకరిస్తుండటం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొంది. అయితే కెరీర్ ప‌క్క‌న పెడితే ఇక్క‌డ మ‌నం గమనించాల్సిన విషయం ఏమిటంటే గత కొంతకాలంగా రష్మిక మరియు విజయ్ కలిసి కనిపించిన సందర్భాలు, ఇద్దరి కుటుంబాలు కూడా కలిసిన సందర్భాలు బయటికి రావడం… ఇవన్నీ ఈ రూమర్స్‌ను బలపర్చాయి.త్వ‌ర‌లో వారిద్ద‌రి వివాహం జ‌ర‌గ‌డం ఖాయం అని అంటున్నారు.

Must Read
Related News