అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heroine Rashi Singh | టాలీవుడ్ నటి రాశీ సింగ్ (Rashi Singh) ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘3 రోజెస్ సీజన్ 2’ (3 Roses Season 2) ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన కాలేజీ రోజుల్లో జరిగిన లవ్ స్టోరీ గురించి ఓపెన్‌గా చెప్పుకోవడంతో నెట్టింట చర్చ మొదలైంది.
రాశీ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇంటర్ పూర్తి చేసి కాలేజీలో చేరిన సమయంలో తన వయసు కేవలం 17 ఏళ్లు. అదే సమయంలో తనకు బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. అతడు తాను చదివే కాలేజీలోనే లెక్చరర్’ అని తెలిపారు. పరీక్షల సమయంలో క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం, వైవా సమయంలో ఏ ప్రశ్నలూ అడగకుండా కూర్చోబెట్టడం వంటివి చేసేవాడని రాశీ చెప్పింది.
Heroine Rashi Singh | నెటిజన్ల ఆగ్రహం, ట్రోలింగ్
‘మాది సీరియస్ లవ్ కాదు… ఇప్పుడు అతనికి పెళ్లి అయింది. ఇన్‌స్టాలో కూడా నన్ను ఫాలో అవుతున్నాడు” అని చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో (Social Media) తీవ్ర ప్రతికూల స్పందన వ్యక్తమవుతోంది. ఒక విద్యార్థి–లెక్చరర్ సంబంధాన్ని (student-lecturer relationship) ఇలా చెప్పుకోవడం సరైన సందేశం కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రమోషన్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ‘శశి’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రాశీ సింగ్, అనంతరం ప్రేమ్ కుమార్ (Prem Kumar), భూతద్దం భాస్కర్ నారాయణ, ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల రాజ్ తరుణ్ సరసన ‘పాంచ్ మినార్’ లోనూ కనిపించి ఆకట్టుకున్నారు.
ఇప్పుడు ‘3 రోజెస్ సీజన్ 2’లో ఈషా, కుషిత కుల్లపుతో కలిసి కీలక పాత్రలో నటించారు. రిలీజ్ చేసిన టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకుంది. సత్యం రాజేష్ (Satyam Rajesh), సాయి రోనక్, హర్ష చెముడు, సౌరభ్ దింగ్రా, సంగీత్ శోభన్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్‌కు దర్శకుడు మారుతి షో రన్నర్ గా వ్యవహరించగా, కిరణ్ డైరెక్ట్ చేశారు. ‘బేబీ’ ఫేమ్ SKN నిర్మించిన ఈ సీజన్ డిసెంబర్ 12 నుంచీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.