అక్షరటుడే, ఎల్లారెడ్డి : Sankranthi Festival | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులపోటీలకు విశేష స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ (Nallamadugu Surender) నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Sankranthi Festival | ఎల్లారెడ్డి బస్ డిపో ప్రాంగణంలో..
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్లారెడ్డి బస్ డిపో (Yellareddy Bus Depot) ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది మహిళలు తరలివచ్చారు. ముగ్గులు వేసేందుకు మహిళలు పోటీపడ్డారు. కులమతాలకు అతీతంగా మహిళలు పాల్గొని ముగ్గులను వేశారు. సంక్రాంతి కళను ఉట్టిపడేలా వివిధ డిజైన్లలో వేసిన ముగ్గులు అందరినీ అలరించాయి. ఉత్తమమైన ముగ్గులను ఎంపిక చేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే సురేందర్ (Former MLA Surender) బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తానాజీరావు, నర్సింలు, సతీష్, అర్వింద్, పృథ్వీ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.