అక్షరటుడే, భిక్కనూరు: Sankranthi Festival | భిక్కనూరు (Bhiknoor) మండలంలోని కాచాపూర్‌లో (Kachapur) సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన బాలికలకు పోటీల నిర్వాహకురాలు మైత్రి బహమతులు అందజేశారు. కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Sankranthi Festival | గ్రామాల్లో సందడి..
సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో సందడి నెలకొంది. నగరాలు, పట్టణాల నుంచి జనం పల్లెలకు చేరుకోవడంతో ఇళ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, తోరణాలతో ఇళ్లన్నీ ముస్తాబయ్యాయి. గురువారం సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పల్లె ప్రజలు సిద్ధమయ్యారు.
వ్యవసాయంపై చిన్నారులు వేసిన ముగ్గు, రాసిన కొటేషన్
