అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jajala Surender | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 13న ఎల్లారెడ్డిలో మహిళలకు ముగ్గుల పోటీలు (rangoli competition) నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Former BRS MLA Jajala Surender) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ముగ్గుల పోటీలకు అనువైన స్థలం కోసం బస్సు డిపో ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు.
Jajala Surender | పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ చీరలు..
సంక్రాంతి పండుగను (Sankranthi festival) పురస్కరించుకొని పట్టణంలో పెద్దఎత్తున ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ముగ్గుల పోటీల్లో గెలిచిన మహిళలకు పట్టుచీరలు బహుమతిగా అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే మహిళలందరికీ చీరలు అందజేస్తామన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ తానాజీ, ఆదిమూలం సతీష్, పృథ్వీరాజ్, ఇమ్రాన్, బర్కత్, శ్రావణ్, సాయిలు తదితరులు ఉన్నారు.