ePaper
More
    HomeసినిమాRam Charan | టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం

    Ram Charan | టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ram Charan | మెగాస్టార్​ తనయుడు, గ్లోబల్​ స్టార్​ రామ్​చరణ్​(Global star Ram Charan) మైనపు విగ్రహం మరికొద్ది రోజుల్లో లండన్​లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం(Tussauds Museum)లో ఆవిష్కరణకు సిద్ధం అవుతోంది. మే 9న ఆయన విగ్రహాన్ని లండన్​(London)లోని మ్యూజియంలో ఆవిష్కరించనున్నారు. అనంతరం దానిని సింగపూర్(Singapore) టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారు. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. తాజాగా రామ్​ చరణ్​ విగ్రహాన్ని ఆవిష్కరించనుండడంతో ఆయన ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు.

    మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్‌(Tollywood)లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్‌చరణ్ అంచెలంచలుగా ఎదిగారు. మగధీరతో భారీ హిట్​ సాధించిన ఆయన తర్వాత అనేక సూపర్​ హిట్​ సినిమాలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’‌(RRR)తో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రామ్​చరణ్​ హీరోగా ఇటీవల విడుదలైన గేమ్​ ఛేంజర్​ సినిమా నిరాశ పరిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్​ కొట్టాలని రామ్​చరణ్​ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్ అంచనాలను పెంచుతున్నాయి.

    More like this

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...