అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market)లు తేరుకున్నాయి. ఐటీ సెక్టార్‌లో జోష్‌తో ప్రధాన సూచీలలో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో ముగిశాయి.
ఐటీ సెక్టార్ వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలతో కొనసాగింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు ఒక శాతానికిపైగా పెరగడంతో ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 119 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 38 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 538 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 5 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 43 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 160 పాయింట్లు లాభపడిరది. ఆ తర్వాత సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనై లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరికి సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 85,265 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 26,033 వద్ద స్థిరపడ్డాయి. రోజురోజుకు బలహీనపడుతూ వస్తున్న రూపాయి.. గురువారం కోలుకుంది. ఇంట్రాడేలో 90.43కు పడిపోయినా.. ఆ తర్వాత బలపడి 89.98 వద్ద స్థిరపడిరది.
ఐటీలో కొనుగోళ్ల మద్దతు
బీఎస్‌ఈలో కొనుగోళ్ల మద్దతుతో ఐటీ ఇండెక్స్ పరుగులు తీసింది. ఐటీ ఇండెక్స్ 1.41 శాతం పెరగ్గా.. రియాలిటీ ఇండెక్స్ 0.53 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.39 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.38 శాతం, ఆటో 0.28 శాతం లాభాలతో ముగిశాయి. సర్వీసెస్ ఇండెక్స్ 0.89 శాతం, ఇండస్ట్రియల్ 0.48 శాతం, పవర్ ఇండెక్స్‌లు 0.43 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.36 శాతం, ఇన్‌ఫ్రా 0.35 శాతం నష్టాలతో ముగిశాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం నష్టంతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,817 కంపెనీలు లాభపడగా 2,303 స్టాక్స్ నష్టపోయాయి. 182 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 80 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 261 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో ఉండగా.. 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టీసీఎస్ 1.48 శాతం, టెక్ మహీంద్రా 1.26 శాతం, ఇన్ఫోసిస్ 0.93 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.89 శాతం, ఎయిర్‌టెల్ 0.76 శాతం లాభపడ్డాయి.
Top Losers : మారుతి 0.71 శాతం, ఎటర్నల్ 0.69 శాతం, కొటక్ బ్యాంక్ 0.53 శాతం, టైటాన్ 0.44 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.39 శాతం నష్టపోయాయి.
