HomeసినిమాRakul Preet Singh | మాల్దీవుల్లో రకుల్-జాకీ హాలిడే హంగామా.. నెట్టింట దుమారం రేపుతున్న బీచ్...

Rakul Preet Singh | మాల్దీవుల్లో రకుల్-జాకీ హాలిడే హంగామా.. నెట్టింట దుమారం రేపుతున్న బీచ్ ఫోటోలు

ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్ కెరీర్ కాస్త డ‌ల్ అయింద‌నే చెప్పాలి. ఇటీవ‌ల స‌రైన హిట్స్ రాక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో కాక రేపుతుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rakul Preet Singh | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ సోషల్ మీడియాలో హీట్ పెంచింది. ఎప్పటికప్పుడు తన లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్, ఫ్యాషన్ అప్‌డేట్స్‌తో అభిమానులను అలరించే రకుల్, తాజాగా మాల్దీవులకు వెకేషన్‌కి వెళ్లి అక్కడి అందమైన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో షేర్ చేసింది.

భర్త జాకీ భగ్నానీతో కలిసి బీచ్ తీరం వద్ద గడిపిన రొమాంటిక్ మూమెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు పెళ్లైన ర‌కుల్ గ్లామ‌ర్ ట్రీట్ ఆప‌డంలేదుగా అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. పొట్టి డ్రెస్సుల‌లో ర‌కుల్ క్యూట్‌నెస్ అదుక్స్ అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Rakul Preet Singh | క్యూట్ అందాలు..

తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో ఎంట్రీ ఇచ్చిన రకుల్, మొదటి సినిమాతోనే అందం–అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత ‘సరైనోడు, ధృవ, విన్నర్’ వంటి హిట్స్‌తో టాలీవుడ్‌లో అగ్రనటి అయ్యింది. అయితే వరుసగా వచ్చిన కొన్ని ఫ్లాప్స్ కారణంగా కెరీర్ కొంత మందగించినప్పటికీ, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ దశలో రకుల్ బాలీవుడ్‌పై దృష్టిపెట్టి అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ అయ్యింది. సోషల్ మీడియా (Social Media)లో ఆమె యాక్టివ్‌గా ఉండటం వల్ల అభిమానులతో కనెక్ట్‌ అవుతూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.2024లో నిర్మాత జాకీ భగ్నానీ (Producer Jackky Bhagnani)ని గోవాలో వివాహం చేసుకొని వైవాహిక జీవితం ప్రారంభించింది ర‌కుల్. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించినా, సోషల్ మీడియాలో ఫ్యాషన్, ట్రావెల్, ఫిట్‌నెస్ కంటెంట్‌తో నిరంతరం ఎంగేజ్ అవుతోంది.

ఫిట్‌నెస్ ప్రీక్‌గా పేరున్న రకుల్ తరచూ జిమ్, యోగా సెషన్ ఫోటోలు షేర్ చేస్తుంది. బీచ్ ఫోటోషూట్‌లు, షార్ట్ అవుట్‌ఫిట్స్‌లో చేసిన పోజులు నిమిషాల్లోనే ట్రెండింగ్ అవుతుంటాయి. ఇదే రీతిలో మాల్దీవుల్లో తీసుకున్న తాజా ఫోటోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.జాకీతో కలిసి రిసార్ట్‌లో, సముద్ర తీరంలో గడిపిన హ్యాపీ మూమెంట్స్‌కు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. కామెంట్స్, లైక్స్‌తో రకుల్ ఇన్‌స్టా హాలిడే ఆల్బమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Must Read
Related News