HomeసినిమాTejaswi Rao | రాజు వెడ్స్ రాంబాయి హీరోయిన్ చాలా స్పీడ్.. ఫ‌స్ట్ క్లాస్‌లోనే ఫ‌స్ట్...

Tejaswi Rao | రాజు వెడ్స్ రాంబాయి హీరోయిన్ చాలా స్పీడ్.. ఫ‌స్ట్ క్లాస్‌లోనే ఫ‌స్ట్ కిస్..!

రాజు వెడ్స్ రాంబాయి చిత్ర హీరోయిన్ తేజ‌స్వి రావు వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ తాజా ఇంట‌ర్వ్యూలో త‌న ఫ‌స్ట్ కిస్ గురించి తెలియ‌జేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tejaswi Rao | షార్ట్ ఫిలిమ్స్‌ (Short Films) ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి రావు ఇటీవల ‘కమిటీ కుర్రోళ్ళు’లో త‌న నటనతో ఆకట్టుకున్న తర్వాత, ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai)లో హీరోయిన్‌గా న‌టించి ప్రేక్షకులను మరింత మెప్పించింది.

చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ సాధించడం తో పాటు, గ్రామీణ అమ్మాయి పాత్రలో పూర్తిగా మేకప్ లేకుండా నేచురల్‌గా కనిపించిన తేజస్వి (Heroine Tejaswi) నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా విలేజ్ లుక్, సహజమైన ఎమోషన్ సీన్లు ఆమెకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఈ విజయంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న తేజస్వి, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్ననాటి ఘటనను , ‘ఫస్ట్ కిస్’ అనుభవాన్ని పంచుకుంది.

Tejaswi Rao | అప్ప‌ట్లోనే కిస్..

తేజ‌స్వి రావు చెప్పిన వివ‌రాల ప్రకారం, ఫస్ట్ క్లాస్‌లో చదువుతున్న సమయంలో క్లాస్‌లో తన పక్కనే కూర్చున్న ఒక బాలుడు ఎరేజర్ నేలపై పడేయగా, దాన్ని తీసివ్వమని అడిగాడు. దాంతో నేను తీద్దామ‌ని బెంచ్ కిందకు దిగితే ఆ బాలుడు కూడా దిగిపోయి తన బుగ్గపై ఒక్కసారిగా కిస్ చేశాడని తెలిపింది. చిన్నపిల్లల అమాయకత్వంలో జరిగిన ఆ సంఘటన అప్పటికి తమకు కిస్ అంటే ఏమిటో కూడా తెలియని వయస్సు కావడంతో, అది కేవలం ఒక క్యూట్ మూమెంట్‌గా మిగిలిపోయిందని ఆమె చెప్పింది. తేజస్వి ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చురుకైన చర్చ మొదలైంది. “దాన్ని ఫస్ట్ కిస్ అంటారా?”, “ఫస్ట్ క్లాస్ లో జరిగిన విషయం ఇంత డీటైల్ గా గుర్తుందా?” అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

తేజస్వి తాజాగా అందించిన ఈ వ్యక్తిగత జ్ఞాపకం, ఆమె సోషల్ మీడియా (Social Media)లో క్రేజ్ ను మరింత పెంచడంతో పాటు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక రాజు వెడ్స్ రాంబాయి చిత్ర విష‌యానికి వ‌స్తే.. 6 రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకునే సరికి ఈ సినిమా నైజాం ప్రాంతంలో 7.64 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 1.55 కోట్లు వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 4.75 కోట్ల షేర్‌తో పాటు 9.20 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇదే సమయంలో కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లను కలుపుకుంటే మరో 1.24 కోట్ల గ్రాస్ దక్కింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 6 రోజుల్లో 5.30 కోట్ల షేర్‌తో పాటు మొత్తం 10.44 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది. వరల్డ్‌వైడ్‌గా 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 2.8 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్‌బస్టర్‌ గా దూసుకెళ్తోంది.

Must Read
Related News