అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Raja Saab Movie | రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Govt) సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా నిరీక్షిస్తున్న రాజాసాబ్ మూవీ సంక్రాంతి (Sankranthi) సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా టికెట్ ధరలు పెంచాలని చిత్ర బృందం కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు ఓకే చెప్పింది. అలాగే ప్రీమియర్ షోలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Raja Saab Movie | ధరల పెంపు ఇలా..
మూవీ టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై అదనంగా రూ.150 పెంచారు. అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.200 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు పెంచిన రేట్లు అమలులో ఉంటాయి. అలాగే గురువారం సాయంత్రం ప్రీమియర్ షోలకు సైతం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో (Premier Show) టికెట్ ధరను రూ.వెయ్యిగా నిర్ణయించింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు షోకు పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. నిర్మాతలు విన్నపంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ఆదేశించింది. అయితే ప్రభుత్వం రేట్ల పెంపునకు ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.
Raja Saab Movie | ఆకట్టుకున్న ట్రైలర్
రాజాసాబ్ చిత్రబృందం ఇప్పటి వరకు రెండు ట్రైలర్లు విడుదల చేసింది. మొదటి ట్రైలర్ (Trailer)ను మించి రెండో ట్రైలర్ ఉంది. కామెడీ, హారర్ లాంటి ఎమోషన్స్ బాగా చూపించారు. ఇందులో ప్రభాస్ అదరగొట్టారంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.