అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం (LPA) ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయి. సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
Weather Updates | నదులకు భారీ వరద
గత కొన్ని రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉధృతంగా పారుతున్నాయి. గోదావరి (Godavari), కృష్ణ (Krishna) నదులకు భారీగా వరద వస్తోంది. దీంతో ఆయా నదులపై గల అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 4,72,856 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారలుఉ 10 గేట్లు 23 అడుగుల మేర ఎత్తివేత దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో మొత్తం ఔట్ ఫ్లో 5,85,757 క్యూసెక్కులుగా ఉంది.
గోదావరిపై గల శ్రీరామ్ సాగర్‌కు సైతం భారీగా వరద కొనసాగుతోంది 3,40,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 39 గేట్లు ఎత్తి 2,59,397 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.