Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్:Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్​(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడొచ్చని తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎండ తీవ్రత […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్​(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడొచ్చని తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం కాగానే ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురుస్తోంది.

Rain Alert | అర్ధరాత్రి భారీ వర్షం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం(Heavy rain) కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన పడటంతో పలు చోట్ల విద్యుత్​ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. కొన్ని గ్రామాల్లో రాత్రంతా కరెంట్​ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి, మెదక్​, నిజామాబాద్​, ములుగు, సిద్దిపేట, సిరిసిల్లలో వర్షం కురిసింది.

తడిసి ముద్ధయిన ధాన్యం అకాల వర్షంతో అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి కంటి మీద కునుకు లేకుండా కుప్పల వద్ద కాపలా ఉంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. వేగంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...