అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుందన్నారు. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు వాన పడే ఛాన్స్ ఉంది.
వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురవవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతీ భారీ వర్షం పడుతుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు చోట్ల వర్షం పడుతుంది.
Weather Updates | రైతుల ఆందోళన
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రాన్ని వానలు వీడకపోవడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలకు పలు చోట్ల పంటలు కొట్టుకుపోయాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిత్యం వాన పడుతుండటంతో పంటకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. వరికి కంకి నల్లి (Kanki Nalli) తెగులు సోకి గింజలు తాలుగా మారిపోతున్నాయి. మరోవైపు కాటుక రోగం సైతం వస్తోంది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో పంటలు సాగు చేస్తే చివరకు నష్టాలే మిగిలేలా ఉన్నాయని వాపోతున్నారు.