Railway Trial Run | సిద్దిపేట – చిన్నకోడురు మధ్య రైల్వే ట్రయల్​ రన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Trial Run | మనోహరాబాద్ (Manoharabad)​ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్​ పనులు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిద్దిపేట నుంచి చిన్న కోడూరు (Chinna Kodur) వరకు 15 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్​ నిర్మాణం పూర్తయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ట్రాక్​పై ట్రయల్ రన్​ నిర్వహించారు. హైదరాబాద్​ నగరం నుంచి కరీనంగర్​ జిల్లాకు (Karinangar District) కనెక్టివిటీ కల్పించడానికి మనోహరాబాద్​ – కొత్తపల్లి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Trial Run | మనోహరాబాద్ (Manoharabad)​ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్​ పనులు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిద్దిపేట నుంచి చిన్న కోడూరు (Chinna Kodur) వరకు 15 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్​ నిర్మాణం పూర్తయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ట్రాక్​పై ట్రయల్ రన్​ నిర్వహించారు.

హైదరాబాద్​ నగరం నుంచి కరీనంగర్​ జిల్లాకు (Karinangar District) కనెక్టివిటీ కల్పించడానికి మనోహరాబాద్​ – కొత్తపల్లి రైల్వేలైన్​ నిర్మిస్తునారు. మెదక్​ జిల్లాలోని మనోహరాబాద్​ నుంచి గజ్వేల్​, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్​లోని కొత్తపల్లి వరకు రైల్వేలైన్ పనులు సాగుతున్నాయి. 2016లో పనులు ప్రారంభం కాగా.. పూర్తవడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.

Railway Trial Run | వేగంగా పనులు

మనోహరాబాద్ ​– కొత్తపల్లి రైల్వే పనులు ఇప్పటికే 50 శాతం పైగా పూర్తయ్యాయి. సిరిసిల్ల సమీపంలో రైల్వే పట్టాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కొత్తపల్లి (కరీంనగర్) వరకు చేరడానికి మరొక మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్​ నుంచి ఢిల్లీ, ఉత్తరాది నగరాలకు ప్రత్యామ్న్యాయ మార్గం అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్​ నుంచి ఢిల్లీ వెళ్లాలంటే కాజీపేట – పెద్దపల్లి మీదుగా వెళ్లాల్సి వస్తుంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి మార్గం అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో సైతం పలు రైళ్లు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.

Railway Trial Run | ప్రముఖ పుణ్యక్షేత్రాలు

కొత్తపల్లి–మనోహరాబాద్​ రైల్వే లైన్ ప్రముఖ పుణ్యక్షేత్రాల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో కొమురవెల్లి మల్లన్న ఆలయం (Komuravelli Mallanna Temple), వర్గల్ సరస్వతి దేవి ఆలయం (Vargal Saraswati Devi Temple), వేములవాడ రాజన్న ఆలయాలు (Vemulawada Rajanna Temple) ఉన్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల మేర రైల్వేలైన్​ వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 90 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. మిగతా పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో భూసేకరణ పనులు కూడా పూర్తయ్యాయి అని సమాచారం. వేములవాడలోని మానేరు నది మీద సుమారుగా 2 కిలోమీటర్ల రైల్వే వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు కూడా చేశారు.
ప్రస్తుతం ఈ మార్గంలో సిద్దిపేట వరకు రైల్వే లైన్​ పూర్తవడంతో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. పూర్తి మార్గం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే వేములవాడ, కొమురవెల్లి మల్లన్న ఆలయాలకు వచ్చే భక్తులకు సైతం రవాణా సౌకర్యం మెరుగవుతంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...