Homeజిల్లాలునిజామాబాద్​Railway Gate | రెండురోజులు రైల్వేగేట్​ మూసివేత.. ఎక్కడో తెలుసా..?

Railway Gate | రెండురోజులు రైల్వేగేట్​ మూసివేత.. ఎక్కడో తెలుసా..?

రైల్వే డబ్లింగ్​ పనులు జరుగుతున్న నేపథ్యంలో నవీపేట్​ రైల్వేగేట్​ను రెండురోజుల పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు రైల్వేఅధికారులు ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Railway Gate | రైల్వే డబ్లింగ్​ పనులు జరుగుతున్న నేపథ్యంలో నవీపేట్​ రైల్వేగేట్​ను (Navipet railway gate) రెండురోజుల పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు రైల్వేఅధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈనెల 3వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రైల్వేగేట్​ను మూసివేయనున్నారు.

Railway Gate | వాహనాల దారి మళ్లింపు..

రైల్వేగేట్​ మూసివేత నేపథ్యంలో నిజామాబాద్ నుండి బాసర, భైంసా,ధర్మాబాద్ వైపు వెళ్లే వాహనదారులు జన్నేపల్లి మీదుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే బాసర నుండి జానకంపేట, బోధన్ వైపు వెళ్లే వాహనదారులు ఫకీరాబాద్-సాటాపూర్-సాటాపూర్ గేట్ వైపు, బాసర నుండి నిజామాబాద్ వెళ్లే వాహనదారులు జన్నేపల్లి మీదుగా వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్వే పనులను (railway work) వాహనదారులు సహకరించాలని కోరారు.

Must Read
Related News