అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Ramakrishna | టాలీవుడ్ నటుడు, ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ తాజా ట్వీట్లు తీవ్ర చర్చకు దారి తీశాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ, మరియు మహాత్మా గాంధీ వంటి ప్రముఖులను ట్యాగ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరింత ఆశ్చర్యకరం ఏమంటే, ఈ ట్వీట్లు చేసిన కొద్ది గంటల్లోనే ఆయన తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది.
Rahul Ramakrishna | రాహుల్ ట్వీట్ల సారాంశం ఇదే..
రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) తన ట్వీట్లలో రాజకీయ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం అంటూ రాసిన ఆయన, డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ కేటీఆర్‌ను (KTR) ట్యాగ్ చేశారు. అనంతరం “నన్ను చంపేయండి, హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి” అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) ట్యాగ్ చేశారు. చివరికి, అక్టోబర్ 2 గాంధీ జయంతి (Gandhi Jayanthi) రోజున, “గాంధీ సాధువు కాదు.. అసలు అతను మహాత్ముడే కాదు” అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి తావిచ్చాయి.
ఈ ట్వీట్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో (Telugu Film Industry) మరియు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన ధైర్యాన్ని అభినందిస్తుండగా, మరికొందరు గాంధీపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వివాదాస్పదమైన ఈ ట్వీట్లు చేసిన కొద్ది గంటల్లోనే రాహుల్ తన ఎక్స్ ఖాతా డిలీట్ చేయడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన ఎలాంటి మీడియా ప్రకటన ఇవ్వకుండానే అకౌంట్ తొలగించడంతో, ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమా? లేక ట్రోలర్స్ ఒత్తిడి వల్లనో, లేకుంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫిర్యాదుల వల్లా? అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.