HomeసినిమాRahul Ramakrishna | రాహుల్ రామకృష్ణ ఈజ్ బ్యాక్.. ట్వీట్లు డిలీట్ చేసి మళ్లీ ట్విట్టర్‌కి...

Rahul Ramakrishna | రాహుల్ రామకృష్ణ ఈజ్ బ్యాక్.. ట్వీట్లు డిలీట్ చేసి మళ్లీ ట్విట్టర్‌కి రీ ఎంట్రీ!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Ramakrishna | తెలుగు సినీ నటుడు రాహుల్ రామకృష్ణ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల తన ట్విట్టర్ (X) అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసి తిరిగి యాక్టివ్ చేయడం, అంతకుముందు పలు వివాదాస్పద ట్వీట్లను పోస్ట్ చేసి, ఆపై అన్నీ డిలీట్ చేయడం వెనుక ఏం జరిగిందో అనేక అనుమానాలు మొదలయ్యాయి.

దసరా పండుగ రోజున రాహుల్ వరుస ట్వీట్లతో రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్‌లను ఉద్దేశించి పరోక్షంగా ప‌లు ట్వీట్స్ చేశారు. హైదరాబాద్ మునిగిపోయింది. మీ వాగ్దానాలు అన్నీ విఫలమయ్యాయి. కేసీఆర్ మిమ్మల్ని ప్ర‌జ‌లు పిలుస్తున్నారు, ప్రతిదానిని క్రమబద్ధీకరించేందుకు రావాలని అన్నాడు. ఆ తర్వాత మనం చాలా భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము. వేచి ఉండలేను.. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని కేటీఆర్‌ను పిలుస్తూ ఇంకో ట్వీట్ చేశాడు.

Rahul Ramakrishna | అన్నీ తీసేసాడు..

మ‌రో ట్వీట్‌లో కేటీఆర్‌(KTR)ను ‘రక్షకుడిగా’ పిలుస్తూ, “ఇప్పుడు నన్ను చంపేయండి, నాకు ఏమీ ఆశ లేదు అంటూ భావోద్వేగంగా స్పందించారు. తర్వాత మరో ట్వీట్‌లో ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదు, మనం మానవులమే.. ప్రేమతో జీవించాలి అని శాంతి సందేశం ఇచ్చాడు. అంతకు ముందు మహాత్మా గాంధీ(Mahatma Gandhi)పై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. గాంధీ జయంతి రోజున ఆయన పెట్టిన పోస్టులు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో రాహుల్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వివాదంపై దసరా రోజున తర్వాత రాహుల్(Rahul Ramakrishna) ఎలాంటి స్పందన ఇవ్వలేదు. శుక్రవారం ఉదయం ఆయన ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ కావడం, ఆపై మళ్లీ సాయంత్రానికి యాక్టివ్ కావడం గమనార్హం.

అయితే ఇప్పుడు ఆ అకౌంట్‌లో వివాదాస్పదమైన ట్వీట్లు ఏవీ కనిపించడం లేదు. అన్నీ తొలగించబడ్డాయి. దీంతో రాహుల్‌పై ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ట్వీట్లు డిలీట్ చేయించారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసు అధికారుల జోక్యమే కారణమని చెబుతుండగా, మరికొందరు “గాంధీ జయంతి(Gandhi Jayanti) రోజున మద్యం దొరక్క పోయి అంత డిస్టర్బ్ అయిపోయి ట్వీట్లు చేశాడు” అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక రాహుల్ రామకృష్ణ మాత్రం ఈ వివాదంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందించింది లేదు.