- Advertisement -
HomeతెలంగాణRahul Gandhi | రాజకీయాలపై రాహుల్​గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Gandhi | రాజకీయాలపై రాహుల్​గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rahul Gandhi | దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై ఏఐసీసీ అగ్రనేత AICC Leader రాహుల్ గాంధీ Rahul Gandhi ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్​లో (Hyderabad) జరుగుతున్న భారత్​ సమ్మిట్​ (India Summit)లో ఆయన శనివారం పాల్గొన్నారు. మొదటగా పహల్గామ్ (Pahalgam)​ దాడిలో మృతులకు​ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచంలో రాజకీయాలు చాలా మారిపోయాయన్నారు.

ఇప్పుడంతా కొత్తతరం రాజకీయం నడుస్తోందని పేర్కొన్నారు. భారత్​ జోడో యాత్రతో (India Jodo Yatra) ఎంతో తెలుసుకున్నానని.. ప్రజల కష్టసుఖాలు దగ్గరుండి చూశానన్నారు. భారత్​ జోడో యాత్రలో దేశ ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపించారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే రాజకీయాలు చాలా మారిపోయాయని, పదేళ్లక్రితం రాజకీయాలకు ఇప్పటికి ఎంతో తేడా ఉందని వివరించారు. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావడం లేదని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

- Advertisement -

Rahul Gandhi |  తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు..

తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాహుల్​గాంధీ పేర్కొన్నారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాహుల్ పేర్కొన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ సహా పార్టీ ముఖ నేతలు, మంత్రులు రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News