Rahul dev | నా త‌మ్ముడు ముకుల్ దేవ్ మ‌ర‌ణానికి కార‌ణ‌మిదే.. కార‌ణం చెప్పిన రాహుల్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul dev | బాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్(Rahul Dev) తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు చాలా సుప‌రిచితం. ఆయ‌న తెలుగులో అతడు, సింహాద్రి, మున్నా, పౌర్ణమి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక రాహుల్ దేవ్ తమ్ముడు ముకుల్ దేవ్(Mukul Dev) కూడా విలన్​గా చాలా సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమా ముకుల్​కు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి. అయితే ఈ మ‌ధ్యే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul dev | బాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్(Rahul Dev) తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు చాలా సుప‌రిచితం. ఆయ‌న తెలుగులో అతడు, సింహాద్రి, మున్నా, పౌర్ణమి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక రాహుల్ దేవ్ తమ్ముడు ముకుల్ దేవ్(Mukul Dev) కూడా విలన్​గా చాలా సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమా ముకుల్​కు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి. అయితే ఈ మ‌ధ్యే ముకుల్ అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. అత‌ని మ‌ర‌ణం సినీప్రియులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Rahul dev | ఇది అస‌లు కార‌ణం..

అయితే ముకుల్ దేవ్ హ‌ఠాన్మర‌ణానికి డిప్రెషన్ (Depression) కారణమని, అతడి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందని, సరిగ్గా ఫిట్ కూడా లేడని వార్తలు వచ్చాయి. దీనిపై రాహుల్ దేవ్ ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముకుల్ దేవ్ మరణం గురించి మాట్లాడాడు. ముకుల్ దేవ్ డిప్రెషన్‌తో చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదని, కొన్నేళ్లుగా సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడమే ఆయన మరణానికి ప్రధాన కారణమని రాహుల్ దేవ్ స్పష్టం చేశారు. ముకుల్ వారం రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందాడు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత పూర్తిగా తినడం మానేశాడు.

దీనికి తోడు, కొంతకాలంగా తీవ్రమైన ఒంటరితనంతో కూడా బాధపడుతున్నాడు. సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ, వాటన్నింటినీ తిరస్కరించాడు అని తెలిపారు. సరైన ఫుడ్(Food) తినకపోవడంతోనే అతను అనారోగ్యానికి గురయ్యాడని డాక్టర్లు తెలిపారు. కానీ, ముకుల్ మరణం గురించి బయట చాలా వార్తలు వచ్చాయి. అతడి గురించి ఆరోపణలు చేస్తున్నవారు ఎప్పుడైనా హాస్పిటల్​కు వచ్చి అతడిని పరామర్శించారా.. ? నా తమ్ముడు ఎప్పుడు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేవాడు. తన ఆరోగ్యంపై శ్రద్ద చూపకపోవడంతోనే మరణించాడు” అంటూ చెప్పుకొచ్చాడు. 1970 సెప్టెంబర్ 17న న్యూఢిల్లీలో జన్మించిన ముకుల్ దేవ్ 1996లో ‘ముమ్కిన్’ అనే టీవీ సీరీస్‌తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే ఏడాది ‘దస్తక్’ సినిమాతో బాలీవుడ్‌(Bollywood)లోకి అడుగుపెట్టారు. అక్కడ సుష్మితా సేన్‌తో స్క్రీన్ షేర్ చేశారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయాడు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...